Description
నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నన్ను అత్యంత గారాబంగా పెంచిన మా తాత ముత్తవలకు, నాకు ఆవాజ్యమైన ప్రేమను రాగాలు పంచిన నా భార్యా బిడ్డలకు, అక్కబావ బావమరిది ఆయన సంతానం, తమ్ముడు, మరదలు, మేనల్లుడు వారు సంతానం, వియ్యంకులు, వియ్యపురాళ్లు, తమ్ముని కుమార్తెలు, అల్లుళ్ళు వారి సంతానం, నన్ను నిత్యం సంతోషంగా ఉంచడానికి అమూల్యమైన సేవలందించిన మనుమలు, మనుమరాండ్రకు, నన్ను ఎల్లప్పుడూ ప్రేమతో పలకరించి రామునకు లక్ష్మణుని వలే నా మాట జవదాటక ఉ మ్మడి కుటుంబ సంస్కృతికి కట్టుబడిన నా తమ్ముడు మరదలు, కుమారులు, కోడళ్ళు, మా కుమారుల వియ్యంకులు వియ్యపు రాళ్లు, నన్ను ఆద్యంతం అలరించిన మునిమనుమరాళ్ళు. నాకు మోక్ష ప్రాప్తి కలిగించిన నా ముని మనవడికి, నాకు విద్యను నేర్పించిన నా గురువులు, ఉద్యోగ నిర్వహణలో నాకు సహకరించిన సహ ఉద్యోగులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, కార్మికులు, యాజమాన్యాలు, అత్యంత ప్రీతిపాత్రమైన మా వ్యవసాయం, మారేడు మాక గ్రామస్తులు, బంధువులు, చిన్ననాటి మిత్రులు, రైతాంగం, ఇన్ని సంవత్సరాలు నాకు వైద్య సేవలు అందించిన వైద్య బృందం మరియు నా 70 వసంతాల వైవాహిక బంధంలో నాకు తోడునీడుగా నిలిచిన నా సహ ధర్మచారిణి రత్నానికి, అందరికీ, నాకు సుఖవంతమైన జీవితం, సునాయాస మరణము ప్రసాదించిన ఆ పరమేశ్వరునకు ఆ భగవంతుని సన్నిధి నుంచి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను భౌతికంగా మీ మధ్య లేకున్నా, మీ మనసులలో నేను నిర్మాణంలో భాగస్వామ్యం వహించి నిర్మించిన ధర్మల్ విద్యుత్ కేంద్రాలు నెల్లూరు, ఇబ్రహీంపట్నం, కొండపల్లి, నాగపూర్, పానిపట్, సూరత్ ఘడ్ (రాజస్థాన్) మరియు మారేడుమాక సబ్ స్టేషన్ వెలుగులలో నా స్మృతులు, జ్ఞాపకాలతో నిత్యం వెలుగుతూ ఉ ంటాను. ఇంక సెలవు మీ సీతారామయ్య